– ఎంపిడివో శ్రీనివాస్
నవతెలంగాణ-జుక్కల్ : ఉపాదీ హమీ కూలీలందరికి ప్రభూత్వ పరంగా అందిస్తున్న అన్ని సౌకర్యర్యాలు అందించాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. బుదువారం నాడు మండలంలోని దోస్పల్లి గ్రామములో ఉపాదీహమీ పనులు చేస్తున్న క్షేత్రస్థాయి పరీశీలన చేసారు. కూలీల మస్టర్ రోల్ ను పరీశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. వారికి అందుతున్న కూలీలు వివరాలను అరాతీసారు. కొలతల ప్రకారం పని చేస్తే ప్రభూత్వ పరంగా పూర్తీ కూలీ అందుతుందని , ఎండలను దృష్టిలో ఉంచుకొని ఉదయం తొందరగా ఆరు లోపు వచ్చి పనులు చేసి ఎండలో సేదతీరాలని సూచించారు. ఎంపిడీవో తో పాటు జీపీ కార్యదర్శి జాదవ్ మనోహర్ , కూలీలు తదితరులు ఉన్నారు.