క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహాదపడతాయి…

– ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలం కైతాపురం ఎల్లగిరి తూప్రాన్ పేట ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ బుధవారం నిర్వహించారు.హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో లక్కీ వారియర్స్ వర్సెస్ ఇబ్రహీం రాయల్ ఛాంపియన్స్ తలపడడం జరిగింది.లక్కీ వారియర్స్ మొదటి బహుమతిని గెలుచుకుంది.తృతీయ బహుమతి ఇబ్రహీం రాయల్ ఛాంపియన్స్ గెలుపొందారు.ఈ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్యఅతిథిగా చౌటుప్పల్ మండల ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మొదటి నగదు బహుమతి 60.000 రూపాయల నగదును అందజేశారు.బీఆర్ఎస్ నాయకుడు రిక్కల భాస్కర్ రెడ్డి తృతీయ నగదు బహుమతి 30.000 నగదును ప్రధానం చేశారు. ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడానికి క్రీడలు ఎంతగానో దోహదం పడతాయని,శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో సహాయపడతాయని అన్నారు.ఈ కార్యక్రమానికి ఎల్లగిరి గ్రామ మాజీ సర్పంచ్ రిక్కల ఇందిరసత్తిరెడ్డి నాయకులు కందగట్ల పద్మా రెడ్డి, బాలకిషన్ రెడ్డి,రిక్కల జంగారెడ్డి టోర్నమెంట్ నివాకులు మహమ్మద్ ఇబ్రహీం కందకట్ల జంగారెడ్డి రిక్కల మహేందర్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,వెల్మ రామ లింగేశ్వర్ రెడ్డి,బక్కతట్ల యాదగిరి యాదవ్, బక్కతట్ల శ్రీశైలం యాదవ్,బాలగోని లింగస్వామి, బాలగోని శివశంకర్,బాలగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు.