క్రైస్తవులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గుడ్‌ ఫ్రైడే పండుగ సందర్భంగా క్రైస్తవులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసు క్రీస్తు త్యాగానికి, ధైర్యానికి ప్రతీకగా ఈ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరపుకుంటారని గుర్తు చేశారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే ఈ వేడుకలను క్రైస్తవ సోదర, సోదరీ మణులందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.