హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు శువ్రారం. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తన 10వ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మెకానిక్ రాకీ’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్‌ని క్రియేటివ్‌గా డిజైన్ చేసారు. కామెడీ,యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోరు, డీవోపీ: మనోజ్ కటసాని, ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం, ఎడిటర్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె.
లైలా : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్
పుట్టినరోజు నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తన12వ సినిమా అప్‌డేట్స్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు రామ్‌నారాయణ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. విశ్వక్ సేన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘లైలా’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రానికి రచయిత: వాసుదేవ మూర్తి, సంగీతం: తనిష్క్ బాగ్చి, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: అన్వర్ అలీ.