న్యూయార్క్ : పొదుపు చర్యల్లో భాగంగా వచ్చే కొన్నేళ్లలో రూ.10వేల కోట్లు (1.3 బిలియన్ డాలర్లు)ఆదా చేయాలని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. ఇందుకోసం ఆఫీసు స్పేస్‌ను తగ్గించుకోవాలని భావిస్తోందని సమాచారం. కొన్ని కార్యాలయ అంతస్తుల వినియోగాన్ని నిలిపివేయడంతో పాటు పలు అద్దె భవనాల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని భావిస్తోంది. ఉద్యోగులు కార్యాలయాలను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై విశ్లేషించడం ద్వారా అమెజాన్ వ్యాపారాల విభిన్న అవసరాల ఆధారంగా తాము తమ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను నిరంతరం సమీక్షిస్తున్నామని అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ పేర్కొన్నారు.