ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

– కేరింతలు కొడుతూ ఇంటి దారి పడుతున్న విద్యార్థులు
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం లో  పదో తరగతి పరీక్షలు బశనివారం తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన పరీక్షలు శనివారం 30 న జరిగిన సోషల్‌ పరీక్షతో పూర్తయ్యాయి. విద్యాధికారుల  ఆదేశాలతో మండలం లో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి 718 మంది విద్యార్థులు పరీక్షలుహాజరు కావలసిన ఉండగా ఇద్దరు విద్యార్థులు ఆబ్సెట్ అయ్యారు. వారందరికీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మండల విద్యాశాఖాధి బాలునాయక్  చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు పర్యటిస్తూ పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. చివరి రోజు ఇద్దరు గైర్హాజరయ్యారు.చివరి రోజున విద్యార్థులు ఉత్సాహంతో పరీక్షకు హాజరయ్యారు. మండలంలో రెండు సెంటర్లలో 718 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పబ్లిక్ పరీక్షల నుంచి విద్యార్థులకు ఉపశమనం కలగడంతో విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చారు.హస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రుల వద్ద తమ సంతోషాన్ని వెల్లబుచ్చారు.