
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఇందల్ వాయి సహకార సొసైటీ చైర్మన్ చింతల్ పల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఛైర్మన్ మోచ్చ గోపాల్, డైరెక్టర్లు కల్వరాల మల్లారెడ్డి, మాజి వైస్ ఎంపీపీ ముత్తన్న, తలారి రన్వీర్ , పేట్టల ప్రవీణ్, గొల్ల శ్రీనివాస్, ఇట్టేడి బాల్ రెడ్డి తో పాటు తదితరులు చేరారు. చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అహ్వానించిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామం, సహకార సొసైటీ అబివృద్దికి పాటు పడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఛైర్మెన్ చింతల్ పల్లి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటుందని దానికి తోడు ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నడంతో తమంత ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, సోసైటి వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్స్ భదవత్ సుధాకర్, గడ్డం గంగారెడ్డి, నిఖిల్ రెడ్డి, జోగు సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.