ఫీజు తగ్గించాలని ప్రిన్సిపల్ కు వినతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పెంచిన కాన్వోకేషన్ ఫీజును వెంటనే తగ్గించాలని కోరుతూ శనివారం గిరిజన శక్తి వర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆరతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రూ700 ఉన్న ఫీజును రూ.3500 కు పెంచడంతో విద్యార్థుల పై పెను భారం అవుతుందని వివరించారు.వేంటనే  ఫీజును తగ్గించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు లక్ష్మణ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.