నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీని నియమించింది. ఈమేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ఆ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించినట్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు.