నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని బాడ్సి, గ్రామ నాయకులు, సింగంపల్లి ఎంపీటీసీ రమేష్, నర్సింగ్ పల్లి ఎంపీటీసీ రమేష్ బిఆర్ఎస్ కార్యకర్తలు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బాడ్సి ఎంపిటిసి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీలకు ఆకర్షతులమై తమ కాంగ్రెస్ పార్టీలో చేరామని అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని వారి మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.