జవహర్ నవోదయకు వీఆర్ఏ కుమారుడు ఎంపిక

నవతెలంగాణ – నవీపేట్
జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి మండలంలోని తుంగిని వీఆర్ఏ రాజేశ్వర్ కుమారుడు జగదీష్ ఎంపికైనట్లు ఆదివారం తెలిపారు. గ్రామ సేవకుడిగా సేవలందిస్తున్న నిరుపేద కుటుంబం రాజేశ్వర్ కుమారుడు జగదీష్ ఆదివారం విడుదలైన జవహర్ నవోదయ ఫలితాలలో సీటు సాధించడంతో గ్రామస్తులతో పాటు రెవెన్యూ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత కృషిచేసి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.