
మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రజా స్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగానికి ప్రమాద ఘంటికలు అనే అంశంపై సెమినార్ ఉంటుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, కన్వీనర్ ముఖ్యఅతిథి జస్టిస్ చంద్రకుమార్ హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్), ప్రత్యేక అతిధి ప్రొఫెసర్ పద్మజ షా ఉస్మానియా యూనివర్సిటీ వ్యవహరిస్తారని అదేవిధంగా వక్తలుగాఎం.డి అబ్బాస్ (ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి, నర్రా రామారావు, జె వి వి రాష్ట్ర అధ్యక్షులు,మహమ్మద్ హుస్సేన్ పరిరక్షణ వేదిక కో- కన్వీనర్, గైని గంగారాం కో-కన్వీనర్,ప్రజాస్వామిక పరి రక్షణ వేదిక భాగ స్వామ్య సంఘాల ప్రతినిధులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారందరూ ఆహ్వానితులే అని తెలియజేశారు. ఈ కార్యక్రమం 03-04-2024 న ఉ:10-30 గంటలకు, స్థలం ప్రెస్ క్లబ్ మున్సిపల్ ఆఫీస్ పక్కన నిజామాబాద్ వద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక.మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్.టిపి జేఏసీ నిజామాబాద్ సమయానికి అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.