
నవతెలంగాణ – మల్హర్ రావు
కూలీలు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవాలని మండలంలోని మల్లారం గ్రామపంచాయితీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ కోరారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ పరిధిలోని మల్లారం, దబ్బగట్టు గ్రామాల పరిధిలో ఉపాధి కూలీలందరికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 100 రోజుల పాటు ఉపాధిహామీ కూలి పనులు ప్రతి ఒక్కరికి నూతనంగా లభించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం, ఎప్రిల్ 1వ తేదీ నుంచి కూలీలకు ఉపాధి వేతనం రూ.272 నుండి రూ.300 వరకు అనగా రూ.28 పెరగడం జరిగిందన్నారు. మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని ఉపాధి కూలీలు ఈ అవకాశాన్ని వినియోగించుకొనీ,ఎక్కువ సంఖ్యలో కూలీలు ఉపాధిహామీ కూలి పనులకు వెళ్లాలని కూలీలకు కార్యదర్శి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి ప్రకాష్ రావు, మేకల రాజయ్య, నేరేడు కోమ్మ రాజేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ సుమలత, గ్రామపంచాయతీ సిబ్బంది,అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.