
పట్టణంలోని మామిడిపల్లి నలంద విద్యార్థులకు ఓలంపియాడ్. ఐఐటీ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ లక్కారం రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాల్ లక్కారం సాగర్ లు సోమవారం తెలిపారు. నలంద ఐఐటీ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం నందు ఈ -అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన ఆర్ ఎస్ ఎం,, ఆర్ ఎమ్ ఎమ్ ,కే సెట్ ,,బి వి ఎస్ కె ,సి సి ఎం తదితర ఐఐటీ రాష్టస్థ్రాయి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను సుమారు 454 స్కూల్స్ నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో విద్యార్థులు మొదటి 1,2 ,&3 ర్యాంకులను కైవసం చేసుకోవడం మా పాఠశాలకు గర్వకారణం అని అన్నారు,. వర్షిత్ (1),సహస్ర(1) విష్ణుప్రియ (1) హనీ రెడ్డి (1),ప్రీతిరెడ్డి (1)భావన రెడ్డి(1), హృదయ శ్రీ((1), ప్రాచీ (1),పావని (2)చతుర్యా(2)బాలాజీ ((2) అభినయ్ (2),నిత్యా శ్రీ (2) కీర్తిరెడ్డి(2) స్వెజన్ (2) మాధవ సాయి (3),స్ఫూర్తి(3), వెంకట లక్ష్మీ ((3), యువరాజ్ (3), హరిని (3), సిందుష (3), హేమశ్రీ(3) విధ్యార్థులు నలంద పాఠశాల ను అగ్రగామి స్థాయిలో నిలబెట్టారు. ఇలాగే మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పాఠశాల యాజమాన్యం, తెలిపారు.. . రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులకు భారతీయ విద్య భవన్, హైదరాబాద్ లో ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యమ్ చేతుల మీదుగా షీల్డ్ బహూకరిచారు. మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులను వెనుక ఉండి ప్రోత్సహిస్తూ మార్గదర్శకాలు చేసిన యాజమాన్యాన్ని ఈ అబ్యాస్ వారు ఘనంగా శాలువా మేమొంటో తో సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.