– ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఉన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమి రెండు లక్షల రుణమాఫీనీ వెంటనే మాఫీ చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎండిపోయిన వరి పంటలకు వెంటనే 25 వేల నష్టపరిణాన్ని చెల్లించాలని కలెక్టరేట్ కార్డే ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టు వరకు అందించని మూలంగా కొన్ని మండలంలోని అనేక గ్రామాలలో వరి పంటఎండిపోయి రైతుకు మరింత నష్టానికి గురికావాలిసీ వచ్చింది. అనేకసార్లు అధికారులకు చెప్పిన ఫలితం లేకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ లేని మూలంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకోవడం మూలంగా చివరాయకట్టువరకు నీరు అందడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు దీనికి కారణం ప్రభుత్వమే కాబట్టి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25000 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ యాసంగి నుండి క్వింటాకు 500 బోనస్ ఇవాళ అన్నారు. మద్దతు ధరల చట్టం అమలయంత వరకు పోరాడాలన్నారు.వేసవి కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి గ్రామాలలో తాగునీరు సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి కి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, ఉదయ్ గిరి, కాకి మోహన్ రెడ్డి, దశరథ, నర్సింహ రావు, సామ నర్సిరెడ్డి, సంజీవ రెడ్డి, కమల్ల శ్రీను, డి రవి, నల్గొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.