తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన డిజిటల్ క్రియేటర్స్ మీట్ ‘ఆరిజిన్ డే’ డిజిటల్ రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవడమే కాకుండా, అపూర్వమైన మైలురాళ్లను కూడా నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకకు 700 మందికి పైగా డిజిటల్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక, డిజిటల్ క్రియేటర్ కమ్యూనిటీ బలాన్ని, చైతన్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సమావేశంగా నిలిచింది.
ఈ వేడుకలో విజరు దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి దాపరికం లేకుండా హదయపు లోతులలోనుంచి వచ్చిన మాటలతో జరిగిన ఈ చర్చ, తరాల సినిమా, డిజిటల్ కంటెంట్ సష్టికి వారధిగా నిలిచింది. ఈ చారిత్రాత్మక వేడుక వివిధ వేదికలలో 100కి పైగా డిజిటల్ సష్టికర్తల పేజీలు, ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారమై డిజిటల్ రంగంలో మునుపెన్నడూ చూడని ఘనతను సాధించింది. వేడుక ముఖ్య ఘట్టాలు, ముఖ్యంగా విజరు దేవరకొండ చేతుల మీదుగా ‘తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్’ సభ్యత్వ కార్డు, చిరంజీవి చేతుల మీదుగా హెల్త్ కార్డ్‌ను ప్రారంభించడం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యాయి. డిజిటల్ సష్టికర్తలు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అలాగే వత్తిపరమైన వద్ధిని పెంపొందించడంలో ‘తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్’ నిబద్ధతను ఈ కార్యక్రమాలు నొక్కి చెబుతున్నాయి.