మంత్రి హరీష్‌రావు సభ విజయవంతం

– అచ్చంపేట ప్రజానీకానికి,రైతాంగానికి కృతజ్ఞతలు
– 2,300 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు
– గృహలక్ష్మి పథకం క్రింద 5 వేల ఇండ్లు
– ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ గువ్వల బాలరాజు
నవ తెలంగాణ – అచ్చంపేట రూరల్‌
అచ్చంపేటలో బుధవారం దాదాపు 25 నుండి 30 వేల మందితో మంత్రి హరీష్‌రావు సభను విజయవంతం చేసిన అచ్చంపేట ప్రజానీకానికి, రైతాంగానికి, భారాసా కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు, అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని అచ్చంపేట ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం నాడు అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై వున్న నమ్మకం, కృష్ణా నది నీటితో రైతుల పాదాలు కడుగాతనన్న నాపై నమ్మకంతో, ప్రేమతో ప్రజలు, రైతులు సభకు హాజరై విజయవంతం చేశారని అన్నారు. ఊహకందని విధంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది మరియు దేశ రాజకీయాల్లో మన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ముందడుగు వేస్తున్నారని అన్నారు. కోటి ఎకరాల మాగానికి నీరు అందిస్తానని మాట ఇచ్చి ఆచరణలో పెట్టి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రేరణ, మార్గదర్శకంలోనే ముందడుగు వేస్తూ అచ్చంపేట రైతులందరికి సాగునీటి అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2300 కోట్లతో ప్రాజెక్టులను మంజూరు చేయడంతో పాటు అచ్చంపేట నియోజకవర్గ పలు అభివృద్ది పనులకోసం కోట్లాది రూపాయలతో ప్రారంభోత్స వాలు, అచ్చంపేటకు నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల ఏర్పాటుకు గాను మంత్రి హరీష్‌రావును కోరగా సానుకూలంగా స్పందించి త్వరలో వాటిని మంజూరు చేస్తానని మంత్రి వాగ్దానం చేయడం జరిగిందని తెలిపారు. అచ్చంపేటను అన్ని రంగాలలో అభివృద్దిలోకి తీసుకురావడమే నా అభిమతమని, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించడమే నా శ్వాస, ధ్యాసే లక్ష్యంగా ఆలస్యంగాన్కెనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ త్యాగానికైనా సిద్దంగా ఉండి వెనుకడుగు వేయకుండా భావి తరాలకు చిరస్థాయిగా నిలిచేలా పనిచేస్తూ పోతున్నాని అన్నారు. రానున్న రోజుల్లో గృహలక్ష్మి పథకంలో భాగంగా 5 వేల ఇండ్లు సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే ఉప్పునుంతల మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు మరికొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరుకు మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. పైశాచి కానందంతో ప్రతపక్షాలు రాజకీయంగా నన్ను విమర్శలు చేస్తున్నారని, ప్రజల మద్దతు, దీవెనలు ఉన్నంత వరకు ప్రజా క్షేత్రంలోనే వుంటామని అన్నారు. జూన్‌ 6న సీఎం కేసీఆర్‌ సభను 80 వేల మందితో నిర్వహించుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛ్కెర్మన్‌ ఎడ్ల నరసింహ్మా గౌడ్‌, రైతు సమన్వయ సమితీ జిల్లా అధ్యక్షులు పోకల మనోహర్‌, ఎంపీపి రామావత్‌ శాంతాబాయి లోక్యానాయక్‌, పదరా జడ్పిటిసి సభ్యులు రాంబాబు నాయక్‌, బిఆర్‌ఎస్‌ అచ్చంపేట పట్టణ అధ్యక్షులు పులిజాల రమేష్‌, నాయకులు రాజేశ్వర్‌ రెడ్డి, సింగిల్‌ విండో డ్కెరెక్టర్‌ శంకర్‌ మాదిగ, కౌన్సిలర్‌ రమేష్‌ రావు పాల్గొన్నారు.