విస్తారాకు పైలట్ల కొరత దెబ్బ

– భారీగా విమానాల రద్దు
న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ల కొరత తీవ్రంగా వేదిస్తోంది. సిబ్బంది లేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. మంగళవారం మరో 38 విమానాలను రద్దు చేసింది. ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను నిలిపివేశారు. ఇందులో ముంబయి, ఢిల్లీ, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన విమానాలు ఉన్నాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధంతరంగా విమానాల రద్దునపై విస్తారాను డిజిసిఎ వివరణ కోరింది.