వీపనగండ్ల : తెలంగాణ రాష్ట్ర దశాబ్దీ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎంపీపీ కమలేశ్వరరావు కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మండల స్థాయి అధికారులకు రాష్ట్ర దశాబ్దీ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు తూ జూన్ 2 రాష్ట్ర ఆవీర్భావం సందర్భంగా 21 రోజులపాటు గ్రామా ల్లో 9 సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమం , అభివృద్ధి పను లను ప్రజలకు వివరిం చాలన్నారు. రైతు వేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. జూన్ 3న చెరువు కట్టల వద్ద బతుకమ్మ సంబురాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. రోజు ఒక్కొక్క శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో కార్యక్రమాలు చేప ట్టాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్లను సన్మానించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో కలిసి దశాబ్దీ ఉత్స వాలను జయప్రదం చేయాలని పిలు పునిచ్చారు . కార్యక్ర మంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి, ఎంపీడీవో కథలప్ప, తాహసీల్దార్ పాండు నాయక్, తూముకుంట సింగిల్ విండో చైర్మన్ రామన్‌గౌడ్, సర్పంచులు నరసింహారెడ్డి, అంజయ్య నాయక్, రాణి, రాంచందర్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు డాక్టర్ రాజశేఖర్ , డా కేశ్వర్ గౌడ్, ఏపీవో శేఖర్ గౌడ్, ప్రభు, ఎంపీఓ భద్రీనాథ్ , పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, నరేష్ , ఏ ఈ ఓ లు మానస, రజిత, శివ, మోహన్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.