సీఎం శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు..
నవతెలంగాణ పాలకుర్తి రూరల్
మండలంలోని రాఘవపూర్ గ్రామంలో 2017లో 220.15 లక్షల అంచనాతో 70 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోని తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. నేటికీ కూడా అట్టి ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. 60 ఇల్లు మాత్రమే నిర్మాణం అయినాయి. ప్రభుత్వం వేసిన అంచనాలో 10 ఇండ్లు తగ్గి నాయి. కాగా10 ఇండ్లు ఇంకా తుది దశలో నిర్మాణం కొనసాగుతున్నాయి అని గ్రామ ప్ర జలు అంటున్నారు. గ్రామంలోని కొందరు ఆర్థికంగా వెనుకబడిన వారు, తాము సొం తంగా ఇల్లు కట్టుకోలేక సర్కారు ఇల్లు ఇస్తదన్న ఆశతో ఉన్నామని అంటున్నారు. మరి కొందరు వేరే ఇంట్లో కిరాయి ఉందామన్న ఇల్లు దొరకడం లేదని ఇల్లు కట్టుకోలేక ఆశతో సతమతమవుతున్నామని అంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసిన స్థలం గతంలోనే అనగా 1990 లోనే నాలుగు ఎకరాల స్థలం కొరకు 90 మంది వరకు వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు డబ్బులు చె ల్లించిన వారు కనీసం ఇల్లయినా దక్కుతుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నాం అని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఇండ్ల కొరకు ఎదురు చూ స్తున్న తమకు నిర్మాణంలో ఉన్న ఇండ్లు త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ పంచా లని స్థానిక ప్రజలు కోరుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గ్రామానికి రావడంతో గ్రామంలోని ఇండ్లు లేని పేదలందరికీ పక్కా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తారన్న ఆశ తో మురిసిపోయామని, ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రేకుల ఇల్లు శిథిలమైంది : కూసరి కొమురయ్య,
వ్యవసాయ కూలీ, రాఘవపురం కుటుంబం మొత్తం పిల్లలతో పదిమంది వరకు ఉన్నాము. రేకుల ఇల్లు కనీల తో ఉంది.గాలి వస్తే ఎప్పుడు కొట్టుకుపోతాయో అన్న ఆందోళనతో ఉన్నాము. ఎవ రింటికైనా కిరాయికి ఉందామన్న, పెద్ద కుటుంబం అయ్యేసరికి ఎవరూ ఇండ్లు కిరా యికి ఇవ్వడం లేదు. సర్కారు ఇల్లు ఇస్తది అన్న ఆశతో ఉన్నాను.
ముఖ్యమంత్రి గ్రామానికి వస్తే సంతోషపడ్డాం :
గూడూరు సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్యమంత్రి స్వయంగా మా గ్రామానికి వస్తే ఎంతో ఆనందం అనిపించిం ది. గ్రామంలోని రైతులకు ఇంటికొక పాడి గేదె ఇస్తానని, ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తానంటే ఎంతో ఆనందంతో గంతేశాము. ఏడు సంవత్స రాలైనా మొదలుపెట్టిన ఇండ్లు పూర్తికాలేదు. అధికారులు సదరు కాంట్రాక్టర్‌తో వెంటనే పనులు పూర్తి చేయించి పేదలకు పేదలకు పంపిణీ చేయాలి.
ఇల్లు కూలిపోతే పరదలు కప్పుకున్న :
చిన్నాల పరశురాములు, రైతు, రాఘవాపురం గత రెండు సంవత్సరాల క్రితం పెంక ఇల్లు కూలిపోయింది.ఎండ వాన కొర కు పరదాలు కప్పినాను. ఇల్లు కట్టుకోలేక, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారని ఆశ తో ఉన్నాను.వర్షాలకుకూలగా మిగిలిన చిన్న అర్రల ఇబ్బంది పడుతున్నాం. వర్షా లకు ఉరుములకు పిల్లలు భయపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు పూర్తి చేసి, నాకు ఒక ఇల్లు కేటాయించాలి.
త్వరలోనే పనులు పూర్తిచేసి ఇండ్లు పంపిణీ చేస్తాం :
నల్ల నాగిరెడ్డి, ఎంపీపీ పాలకుర్తి ఇండ్ల నిర్మాణము దశకు వచ్చింది.నిర్మించిన ఇం డ్లకు పూర్తిగా తుది మెరుగులు దిద్ది, గామంలో అర్హు లైన వారందరికీ ఇండ్ల పంపిణీ చేస్తాం.
60 ఇండ్లకు 50 పూర్తి అయినవి :
సోమ శ్రీనివాస్ సర్పంచ్ రాఘవాపురం రెండవ విడత మొదలుపెట్టిన 30 ఇండ్లు వ ర్రె ఎంకన్న కాంట్రాక్ట్ తీసుకొని నిర్మిస్తున్నారు.పది ఇ ల్లు నిర్మాణంలో తదశలో ఉన్నాయి.1990 లోనే ఇం డ్ల ప్లాట్ల కొరకు కొంతమంది డబ్బులు ఇచ్చారు. అట్టి స్థలంలోనే డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నారు .ప్రస్తుతం కొంతమంది సొంత డబ్బులతో ఇల్లు ని ర్మాణం చేసుకోగా మిగిలిన అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వము ఎంపిక చేసి ఇండ్ల పంపిణీ చేయాలి.
నెల రోజుల్లో పనులు పూర్తి అవుతాయి వర్రె వెంకన్న, ఇండ్ల కాంట్రాక్టర్, పాలకుర్తి రాఘవాపురంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాంట్రాక్టు తీసుకొని ప నులు చేస్తున్నాను. నిర్మాణము పనులు దగ్గర పడ్డాయి. నెల రోజుల్లో పను లన్నీ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పజెప్తాను.