
బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐఎంఎల్ మస్ లైన్ ప్రజా పంథా పార్టీ జిల్లా కార్యదర్శి వి, ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రం లోని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిజాంసాగర్ కెనాల్ 82/2 గండి పడడంతో 15 కుటుంబాలు తీవ్ర నష్టపోయాయి కావున వారికి 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, బుధవారం జిల్లా కలెక్టర్ ను సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా మాస్ లైన్ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1. తేదీ ఉదయం 3 గంటల తెల్ల వారు జమున నిజాంసాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ 82/2 ఆకస్మికంగా గండి పడింది. ఈ విశయం పై ప్రజా పంథా పార్టీ విచారణ వ్యక్తం చేయగా కెనాల్ లో మొత్తం చెట్లతోని, చెత్తతో నిండి ఉంది , ఇరిగేషన్ స్థానిక అధికారులు ఏనాడు కూడా కెనాల్నీ, అక్కడ ఉన్న ప్రాంతాన్ని పర్యటించి నీటి ప్రవాహం గురించి, నీటిపారుదల ఏ విధంగా జరుగుతుందో కూడా చూడని పరిస్థితి ఉంది. మూడుసార్లు ఆకస్మికంగా ఇదే చోటు నుండి గండి పడిందని స్థానికులు చెబుతున్న కూడా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదు, కెనాల్ ఆకస్మితంగా గండిపడడం ద్వారా సుమారుగా ప్రవాహంలో 15 ఇండ్లలో నీరు భారీ ఎత్తున రావడం, నిద్ర లో ఉన్న కుటుంబాలు భయాందోళన గురై కట్టుబట్టలతో బయటకు పరిగెత్తారు, చాలా బట్టలు వంట సామాన్లు డబ్బులు బంగారు నగలుతో నీళ్లలో కొట్టుకుపోయాయని అంతేకాకుండా ఒక ఫీట్ మందం ఇసుక మెట్ట వేసింది, ఇదంతా జరిగిన కూడా ఇరిగేషన్ అధికారులు పేద కుటుంబాలపై జాలి లేకుండా వారిని బెదిరించి అక్కడ దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు మధ్య నివసిస్తున్న ప్రజలను ఇల్లు లాగేసుకుంటామని ఇల్లు కులగోడతమని ఇరిగేషన్ అధికారులు బెదిరించడం సరైన పద్ధతి కాదని ఈ విధానాన్ని ఖండిస్తున్నామని వారు అన్నారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే అక్కడ గుడిసె కూడా ముట్టలేరని పేద ప్రజలకు మా పార్టీ అండగా ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని వారు తెలిపారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి బి, దేవారం మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కెనాల్ గండి అయిందని అయినా కూడా మరువతులు చేయకుండా అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని ఈ యొక్క ఆకస్మిక గండి ద్వారా నిండు గర్భవతులు భయంధాలను గురయ్యారని వారి సామాన్లని కొట్టుకుపోయి తిండి గింజలు బియ్యం పప్పులు కూరగాయలు బీరువాలో వస్తువులు, బట్టలు ఉన్నటువంటి తడిసి ముద్ద కావడమే కాకుండా బయట ఉన్నావని నీళ్లపాలయ్యాయని గత 20 సంవత్సరాలుగా సుమారు 70 నుండి 80 కుటుంబాలు ఇక్కడే రేకులు గుడిసెలు వేసుకొని మున్సిపాలిటీకి టాక్సీ భరించి విద్యుత్ కలెక్షన్లు పొంది అక్కడ జీవనాన్ని గడుపుతున్నారు వీరంతా ఋజు వారి కూలి పనులు చేసుకుని జీవించే శ్రామిక కుటుంబాలు, వీళ్ళకు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి, కొంతమంది లేవు, కావున వీరందరికీ పట్టాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, అరు గ్యారంటీలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ ,పార్టీ నాయకులు అనిల్ కుమార్, నజీర్, బాధితులు కాలనీవాసులు పాల్గొన్నారు.