
పట్టణ కేంద్రంలో రాంనగర్ కాలనీలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం బుధవారం నిర్వహించినారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ ,స్థానిక కౌన్సిలర్ గంగా మోహన్ చక్ర కౌన్సిలర్లు సుంకరి రంగన్న, ఆకుల రాము, జిమ్మి రవి, గుద్దేటి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్న రవి కుమార్, పట్టణ విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు పడకంటి భాను ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(SDF) కింద 5 లక్షల రూపాయలు ఇస్తానని హామి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.