నామినికి భీమా నగదు అందజేత..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పురుషుల పొదుపు సంఘం సభ్యుడు ఐలేని మహేందర్ రెడ్డి అనారోగ్యంతో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. బుధవారం పొదుపు సంఘం అధ్వర్యంలో రూ.81,609 బీమా నగదును మృతుని నామినికి అందజేశారు. పొదుపు సంఘ సమితి అధ్యక్షుడు పన్యాల విష్ణువర్థన్ రెడ్డి,గణకుడు బండారు రాజేందర్,సంఘాధ్యక్షుడు సంగ రవి, ఉపాధ్యక్షుడు వాసిమల్ల రమేష్,పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.