
రాష్ట్రీయ కళామంచ్ “సింగిడి”- 2024 పేరుతో నిర్వహించనున్న విద్యార్థి సాంస్కృతిక పోటీలను ఈ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏప్రిల్ 20,21 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి కళని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్రీయ కళామంచ్ “సింగిడి”-2024 పేరుతో విద్యార్థుల ముందుకు తీసుక రావడం జరుగుతుందని, విద్యార్థి కళాకారులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతూ రాష్ట్రీయ కళామంచ్ “సింగిడి” -2024 పోస్టర్ ను ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో ఏబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన శివ, ఇందూరు జిల్లా కన్వీనర్ సునీల్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు,యూనివర్సిటీ కార్యదర్శి అమృత్,ఉపాధ్యక్షులు పావని ఇందూరు తదితరులు పాల్గొన్నారు.