నవతెలంగాణ – జక్రాన్ పల్లి
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంఘాల సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి బుధవారం అన్నారు. మండలంలోని కలిగోట్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం సభ్యులు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను మున్నూరు కాపు సంఘ సభ్యులు శాలువాతో సన్మానించి సంఘం యొక్క సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అయిన తర్వాత సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగోట్ మున్నూరు కాపు సంఘం సంఘ సభ్యులు పాల్గొన్నారు.