నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వికలాంగులను గుర్తుంచి పెన్షన్లు మంజూరి చేయడం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే సదరం క్యాంపు ను హుస్నాబాద్ లో ఏర్పాటు చేయాలని హుస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కు వివిధ రకాల వికలాంగులు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చెవిటివారు ,కాళ్ళు,చేయిలు విరిగినవారు ,పక్షవాతం , తలకు దెబ్బ తగిలి అవయవాలు పనిచేయని వారు దూర ప్రాంత వెళ్లాలంటే తిప్పలు తప్పడం లేదన్నారు. మందు గోలీలకు డబ్బులు లేక అనేక అవస్థలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నా వికలాంగులకు హుస్నాబాద్ లో సదరం క్యాంప్ ఏర్పాటుచేసి న్యాయం చేయాలన్నారు. హుస్నాబాద్ శాశనసభ్యులు,మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి హుస్నాబాద్ లో సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు.