నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒకరు అదృశ్యం అయిన సంఘటనలో కేసునమోదు అయింది. అదృశ్య వ్యక్తి సోదరుడు బాబూరావు ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ పీ శివరామకృష్ణ కథనం ప్రకారం. మండలంలోని దబ్బతోగు కు చెందిన (28) ఏళ్ల వయస్సున్న మడకం గంగరాజు తన కుటుంబీకులతో ఓ విషయంపై గొడవపడి మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కాగా రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల తమ బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గంగరాజు సోదరుడు మడకం బాబురావు బుధవారం పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.