నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

నవతెలంగాణ -రాయపోల్

రాయపోలు మండల కేంద్రానికి చెందిన దివంగత ఎంపీటీసీ బ్యాగరి యాదమ్మ కుమారుడు బీఆర్ఎస్ నాయకులు సతీష్- మమత వివాహ వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డి కొడకండ్ల గ్రామంలో బుధవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో తొగుట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రామిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, నాయకులు విష్ణు, నవీన్, స్వామి, అజయ్, బాలకృష్ణ, శివకుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.