పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై రైతుల ధర్నా
నవతెలంగాణ-రేగొండ
తడిసిన వరి ధాన్యంను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం మండల పరిధి పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని పోసి తగలబెట్టి రోడ్డుపై బఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం రేగొండలోని ఐకెపి సెంటర్‌కు వరి ధాన్యాన్ని తీసుకు వచ్చినప్పటికీ, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కాంటాలు కాక పడికాపులు కాస్తున్నామని అన్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి తడిసి ముద్దయిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్ నుండి ఇప్పటివరకు రెండు మూడు లారీలే ధాన్యాన్ని కాంటాలు పెట్టి పంపించారని అన్నారు. వెంటనే కాంటాలు పెట్టి త్వరగా కొనుగోలు చేయాలని అన్నారు. కాగా ట్రాఫిక్ స్తంభించడంతో రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. రైతులు రవీందర్ రెడ్డి బుచ్చిరెడ్డి వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
జీఎస్సార్ రాస్తారోకో
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో తడిసిన వరి ధాన్యాన్ని మొత్తం తరుగు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొను గోలు చేయాలని టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపా లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి గండ్ర సత్యనారాయణ రావు హన్మకొండ – భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్సార్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షానికి భూపాలపల్లి నియోజ కవర్గం లోని అన్ని పిఎసిఎస్ సెంటర్లో ఉన్న వరి ధాన్యం మొత్తం తడిసిందని అన్నారు. ధాన్యాన్ని తీసుకువచ్చి 20, 30 రోజులు కావస్తున్నా కాంటాలు కావడం లేదని, బార్దాన్ సంచులు లేక, లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు, సివిల్ సప్లై డిఎం, డిఎస్‌ఓలు కుమ్మకై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అదనంగా 2 నుండి 10 కిలోల వరకు కోతలను పెడుతున్నారని అన్నారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల ప్రెసిడెంట్ యిప్పకా యల నర్సయ్య, టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, స్టేట్ ఓబీసీ కో ఆర్డినేటర్ ఒరంగంటి శంకర్, ముఖ్య నాయకులు గూటోజు కిష్టయ్య, సూరం వీరేందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మేకల రవికుమార్, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్యామల, మండల యూత్ కాంగ్రె స్ ప్రెసిడెంట్ కనకం రమేష్, ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ రవీందర్, ఉపసర్పంచ్ తిరుపతిగౌడ్, సాంబయ్య, సీనియ ర్ నాయకుడు కొమురయ్యగౌడ్, మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.