రాఘవేంద్రరావుకు ఓయూ డాక్టరేట్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాచార్యులుగా పనిచేస్తున్న నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన కోటకొండ రాఘవేంద్రరావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) తెలుగు ఓరియంటల్‌ విభాగం నుంచి డాక్టరేట్‌ లభించింది. ప్రొఫెసర్‌ కె జోత్స్నప్రభ పర్యవేక్షణలో ‘పశ్చిమ తెలంగాణ సాహిత్యం-భాష, కన్నడ ప్రభావం’అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. దాన్ని పరిశీలించిన అనంతరం ఓయూ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని తెలుగు విభాగం నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఓయూలో కె జోత్స్నప్రభ, సి కాశీం కలిసి రాఘవేంద్రరావుకు డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌ అలివేలు మంగమ్మ, అధ్యాపక బృందం ఆయన్ను అభినందించారు.