– కోల్‌కతా నైట్‌రైడర్స్ 272/7,
– ఢిల్లీ క్యాపిటల్స్ 166ఆలౌట్
– టాప్‌లోకి రెండుసార్లు ఛాంపియన్
విశాఖపట్నం: ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఢిల్లీపై రికార్డు స్కోర్‌ను నమోదు చేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగి కోల్‌కతా ఐపిఎల్ చరిత్రలో 272పరుగుల రెండో అత్యుత్తమ స్కోర్‌ను చేయగా.. ఛేదనలో ఢిల్లీని 166పరుగులకే పరిమితం చేసి 106పరుగుల భారీతేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత కోల్‌కతాకు శుభారంభం దక్కింది. సాల్ట్-నరైన్ కలిసి తొలి వికెట్‌కు 4.3ఓవర్లలో 60పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ 18 పరుగుల వద్ద నోర్ట్జే బౌలింగ్‌లో ఔటైనా.. నరైన్ బ్యాట్ నుంచి బౌండరీలు, సిక్సర్ల మోతా మోగుతూనే ఉంది. నరైన 39బంతుల్లో 7ఫోర్లు, మరో 7 భారీ సిక్సర్ల సాయంతో 85పరుగులు నమోదు చేశాడు. రఘువంశీ(54) అర్ధసెంచరీతో మెరిసాడు. సునీల్ నరైన్ సూపర్ ఇన్నింగ్స్‌తో కేవలం 8ఓవర్లలోనే కోల్‌కతా 100 పరుగుల మార్కును అందుకుంది. చివర్లో ఆండ్రూ రస్సెల్(41), శ్రేయస్ అయ్యర్(18) విధ్వంసాన్ని కొనసాగిస్తూ.. కోల్‌కతా స్కోర్ 230 దాటించారు. ఇక రింకు సింగ్ 19వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 0, 6, 4 బ్యాట్ ఝుళిపించి 26 పరుగులు రాబట్టాడు. దీంతో కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ రికార్డు స్కోర్(277పరుగులు) మార్క్‌ను ఛేదించేలా కనిపించినా.. చివరి ఓవర్లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కోల్‌కతాను కట్టడి చేశాడు. ఒకే ఓవర్లో రస్సెల్, రమణ్‌దీప్‌లను ఔట్‌చేసి కళ్లెం వేశాడు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 272పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. అలాగే వైజాగ్‌లో అత్యధిక సిక్సర్ల(15) రికార్డు కొట్టుకుపోయింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జేకు మూడు, ఇషాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఛేదనలో ఢిల్లీ లక్ష్యాన్ని ఏ రూపంలోనూ ఛేదించేలా కనిపించలేదు. వార్నర్(18), పృధ్వీ షా(10) రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ పంత్(55), స్టబ్స్(54) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పెవీలియన్‌కు చేరారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2ఓవర్లలో 166పరుగులకు కుప్పకూలింది. కోల్‌కతా బౌలర్లు వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తికి మూడేసి, మిఛెల్ స్టార్క్‌కు రెండు, ఆండీ రస్సెల్, నరైన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునీల్ నరైన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి)స్టబ్స్ (బి)నోర్ట్జే 18, నరైన్ (సి)పంత్ (బి)మిఛెల్ మార్ష్ 85, రఘువంశీ (సి)ఇషాన్ (బి)నోర్టే 54, రస్సెల్ (బి)ఇషాంత్ 41, శ్రేయస్ (సి)మిఛెల్ మార్ష్ (బి)ఖలీల్ అహ్మద్ 18, రింకు సింగ్ (సి)వార్నర్ (బి)నోర్ట్జే 26, వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 5, రమణ్‌దీప్ సింగ్ (సి)పృథ్వీ షా (బి)ఇషాంత్ 2, మిఛెల్ స్టార్క్ (నాటౌట్) 1, అదనం 22. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 272పరుగులు.
వికెట్ల పతనం: 1/60, 2/164, 3/176, 4/232, 5/264, 6/264, 7/266
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-43-1, ఇషాంత్ శర్మ 3-0-43-2, నోర్ట్జే 4-0-59-3, రషిక్ సలామ్ 3-0-47-0, సుమిత్ కుమార్ 2-0-19-0, అక్షర్ పటేల్ 1-0-18-0, మిఛెల్ మార్ష్ 3-0-37-1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి)స్టార్క్ 18, పృథ్వీ షా (సి)వరణ్ చక్రవర్తి (బి)వైభవ్ అరోరా 10, మిఛెల్ స్టార్క్ (సి)రమణ్‌దీప్ సింగ్ (బి)స్టార్క్ 0, అభిషేక్ పోరెల్ (సి)నరైన్ (బి)వైభవ్ అరోరా 0, రిషబ్ పంత్ (సి)శ్రేయస్ అయ్యర్ (బి)వరణ్ చక్రవర్తి 55, స్టబ్స్ (సి)స్టార్క్ (బి)వరణ్ చక్రవర్తి 54, అక్షర్ పటేల్ (సి)మనీష్ పాండే (బి)వరణ్ చక్రవర్తి 0, సుమిత్ కుమార్ (సి)మనీష్ పాండే (బి)నరైన్ 7, రిషిక్ సలామ్ (సి)సాల్ట్ (బి)వైభవ్ అరోరా 1, అన్రిచ్ నోర్ట్జే (సి)శ్రేయస్ (బి)రస్సెల్ 4, ఇషాంత్ శర్మ (నాటౌట్) 1, అదనం 16. (17.2 ఓవర్లలో ఆలౌట్) 166పరుగులు.
వికెట్ల పతనం: 1/21, 2/26, 3/27, 4/33, 5/126, 6/126, 7/159, 8/159, 9/161, 10/166
బౌలింగ్: స్టార్క్ 3-0-25-2, వైభవ్ అరోరా 4-0-27-3, ఆండీ రస్సెల్ 1.2-0-14-1, సునీల్ నరైన్ 4-0-29-1, వరణ్ చక్రవర్తి 4-0-33-3, వెంకటేశ్ అయ్యర్ 1-0-28-0