లుక్‌అవుట్‌ నోటీసు చెల్లదు

– హైకోర్టును ఆశ్రయించిన షకీల్‌ కుమారుడు సాహిల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోలీసులు జారీ చేసిన లుక్‌అవుట్‌ నోటీసుల(ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలంటూ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద గత డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులు జారీ చేసిన ఎల్‌ఓసీని సవాల్‌ చేశారు. రాత్రి వేళ ఫ్లై ఓవర్‌ వద్ద ఉన్న బ్యారికేడ్లను ఢకొీట్టిన కేసులో సాహిల్‌ కోసం పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. దానిని సవాల్‌ చేస్తూ సాహిల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కావాలని ప్రమాదం చేయలేదనీ, హెచ్చరిక బోర్డులు పెట్టక పోవడంతో చీకటి వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ కేసులో ఎల్‌వోసీ జారీ చేయడం అన్యాయమన్నారు. పంజాగుట్ట పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. తన తండ్రికి వైద్యం నిమిత్తం విదేశం వెళితే పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసు ఇచ్చారాన్నరు. ఈ వ్యాజ్యం హైకోర్టు విచారణకు రానుంది.