హైదరాబాద్‌ మార్కెట్లోకి బయోక్లబ్‌ సోడాస్‌

హైదరాబాద్‌ : బయో బెవరేజెస్‌ ఉత్పత్తుల కంపెనీ బయో ఇండియా అధికారికంగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బయో బెవ రేజెస్‌ ఆవిష్కర్త శ్రీనివాస్‌ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌డి, తయారీ కోసం రూ.80 కోట్ల వ్యయం చేశామన్నారు. తమ ఉత్పత్తులు సింథటిక్‌ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయన్నారు. సాంప్రదా య ఉత్పత్తులతో పోలిస్తే అదే శాతంలో అల్కహాల్‌ ప్రభావాలను అందిస్తా యన్నారు.తమ ఉత్పత్తులకు అమెరికా ప్రభుత్వ అనుమతులు కూడా లభిం చాయన్నారు. అబూదాబికి ఎగుమతులు చేస్తున్నామని.. మరిన్ని దేశాలకు విస్తరించే కసరత్తులో ఉన్నామన్నారు.ఈ సమావేశంలో విఎస్‌ఎస్‌ బేవరేజెస్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ప్రదీప్‌, ఎండి శ్రీనివాస రాయలు పాల్గొన్నారు.