న్యూఢిల్లీ : బెర్క్‌షైర్ హాత్వేకి చెందిన లూబ్రిజోల్ అడిటివ్స్ ఐఎంఇఎ వైస్ ప్రెసిడెంట్‌గా నితిన్ మెంగిని నియమించినట్టు ఆ సంస్థ తెలిపింది.అదే విధంగా లూబ్రిజోల్ ఇండియా సిఎండిగా కూడా ఆయన బాధ్యతలను స్వీకరించను న్నారని పేర్కొంది. ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా పలు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్స్ పరిశ్రమలోని బృందాలకు 20 ఏండ్లకు పైగా నేతృత్వం వహించిన అనుభవం ఆయనకు ఉందని ఆ సంస్థ తెలిపింది.