కన్నవారి, పుట్టిన ఊరి, చదివిన బడి ఋణాన్ని ఎవరూ తీర్చుకోలేనిది,అలాగే తల్లిదండ్రులకు,ఉన్న ఊరికి,చదివిన బడికి కేటాయించే ది ఏదైనా అది అమూల్య మే నని అమరవరం పాఠశాల పూర్వ విద్యార్ధి,ప్రవాస భారతీయుడు గంజి రామ చక్రధర్ హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం,అమరవరం జిల్లా పరిషత్ పాఠశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల స్మారకం (పైలాన్ )ను గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు ఎం.వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యార్ధులను ఉద్దేశించి చక్రధర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి ప్రాధమిక విధ్య లోనే ఏదో లక్ష్యాన్ని ఎంచుకుని చదివిన అప్పుడే ఏదో ఒక రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారని సూచించారు.ఉపాధ్యాయులు సైతం విద్యార్ధులకు ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తూ విధ్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలని విజ్ఞప్తి చేసారు. తాను పల్లెటూరి బడిలో చదివి కఠోర శ్రమతో దేశం కాని దేశంలో బతుకుతెరువు కోసం స్థిరపడటం ఆనందంగా ఉన్నప్పటికీ కన్న నేలను,చిన్ననాటి సహచరులను తరుచూ కలవలేక పోతున్నందుకు ఏదో తెలియని,వ్యక్తం చేయలేని వెలితి వెంటాడుతూ ఉందని ఆవేదన చెందారు. నా సహా విద్యార్ధుల సహకారం,మాకంటే ముందు తరం పూర్వ విద్యార్ధుల సూచనలు, సలహాలు మేరకు పాఠశాలకు ఎంతమేర సహాయం చేయగలం మో అంత మేరకు పాఠశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం అమరవరం పీజేసీ రూపకర్త రావులపాటి శంకర్ రావు మాట్లాడుతూ ఏ దేశమేగినా,ఎందుకాలిడినా ముందుగా మనం గుర్తుకు రావాల్సింది కనిపెంచిన తల్లిదండ్రులు,ఆడిపాడిన జన్మభూమి,విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు,వేదిక అయిన బడి మాత్రమే నని, అందుకోసం ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని హర్షం వ్యక్తం చేసారు.ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రస్తుత పాఠశాల సిబ్బంది కీ,హాజరై విజయవంతం చేసిన నాటి – నేటి విద్యార్ధులకు,మా ఆహ్వానం మన్నించి వయో భారం తో సైతం దూరాభారం నుండి వచ్చిన పూర్వ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్లాటినం జూబ్లీ ఉత్సవం రూపకర్తలు తోటమళ్ళ వెంకటి, ఆర్.వెంకటి(వెంకటి ద్వయం), గ్రామ పెద్ద, పాఠశాల హిత కారులు గ్రామీణ వైద్యులు డాక్టర్ రాధాక్రిష్ణ మూర్తి, బుయ్యన వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, వల్లాల రవీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.