– కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే లింగాయత్ ల డిమాండ్ల పరిష్కారం
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే లింగాయత్ సమాజానికి డిమాండ్ల పరిష్కారానికి కృషి జరుగుతుందని అవల్గావ్ గ్రామ లింగాయత్ సమాజ్ పెద్దలు యువకులు తెలిపారు. లింగాయత్ సమాజ్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, అలాగే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు లింగాయత్ సమాజాన్ని ఓసి నుండి బీసీలోకి మార్చడానికి ప్రత్యేక కృషి చేసిన ప్రస్తుత జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ చిత్రపటానికి, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు చిత్రపటాల కు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లింగాయతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవల్గం లింగాయత్ సమాజ్ గ్రామ పెద్దలు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.