బాబు జగ్జీవన్ రాం జీవితం స్పూర్తిదాయకం

– శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్  దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. జగ్గీవన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.