
నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డమీద నుంచి కాంగ్రెస్ పార్టీ “జంగ్ సైరన్” మోగించనుంది అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసా (మేనిఫెస్టో)ను ఈ వేదిక నుంచే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ విడుదల చేస్తారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని,భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో చేజేక్కించుకుంటామని తెలిపారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20వేల మందికి పైగా హాజరుకానున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని సూచించారు.