మతోన్మాదాన్ని నిలువరించడమే జగ్జీవన్ రామ్ కు అర్పించే ఘన నివాళి 

– ఐఎన్ టియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్థన్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
భారతరత్న, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా పాముల బస్తి చౌరస్తాలో గల బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి ఇండ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగులా కృష్ణ, ఐ ఎన్ టి ఏ సి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ దళితులు సామాజిక వివక్షతకు గురవుతున్న తరుణంలో  స్వాతంత్ర ఉద్యమ సమరయోధులుగా భారత  ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్  దళిత కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఎదగటం దళిత అనగారిన వర్గాలకు ఆదర్శనీయమని  అన్నారు. నాటి నుండి నేటి వరకు అణగారిన వర్గాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని అన్నారు.  బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి స్పీకర్ గా ఉన్న తరుణంలో తెలంగాణను ప్రకటించిన ఆదర్శప్రాయులు అన్నారు. కానీ నేటి తరుణంలో దళితులను సామాజికంగా వివక్షతకు గురిచేస్తూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మతోన్మాదులను నిలువరించడమే బాబు జగ్జీవన్ రామ్ కు అర్పించే ఘనమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో అమర్ సింగ్ రాజు, లత, కల్పన, రామచందర్, కొమురయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.