కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వాగతం పలికిన నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తా టి పత్రి జీవన్ రెడ్డి కి శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తా వద్ద నియోజకవర్గ నాయకులు స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిద్దుల గుట్టపై ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఆలయ ఉత్సాహ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. గుట్టపై గల అయ్యప్ప, రామాలయం ,దత్తాత్రేయ ఆలయాలలో సైతం పూజలు నిర్వహించినారు ..ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావు, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జిలు ముత్యాల సునీల్ రెడ్డి, పొద్దుటూరి వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ,,ఆలయ కమిటీ సభ్యులు పిసి గంగారెడ్డి, సుమన్, కొంతం మురళి ,సంజయ్ సింగ్ బబ్లు తదితరులు పాల్గొన్నారు.