నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రస్తుతం ఉన్న కమిటీ గంప నాగేంద్ర పసుపునూరి నాగభూషణం మార్త వెంకటేశ్వర్లు స్వచ్ఛందంగా తమ రాజీనామా చేశారు. శుక్రవారం స్థానిక వివేరాలో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలక్షన్ కన్వీనర్ గా గోరంటి సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఆడహక్ కమిటీ సభ్యులుగా పసుపు నూరి నాగభూషణం, మార్తా వెంకటేశం,జె రామ్మోహన్, గడ్డం సోంచంద్, జి. బాల్రెడ్డి, మంచి కంటి వెంకటేశం, జి అశోక్, సోమ నరసయ్య ను ఎన్నుకున్నారు. ఈనెల 15వ తేదీన నూతన కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.