తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలి..

– చారిత్రాత్మకంగా తుక్కుగూడ సభ.
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
తుక్కుగూడలో శనివారం జరగబోయే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి సభ నిర్వహించి ఆరు గ్యారెంటీలను ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుందని అన్నారు.శనివారం తుక్కుగూడలో నిర్వహించే జన జాతర సభ దేశానికే దిశా నిర్దేశం చేయనుందని చారిత్రాత్మకం కానుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధి సంకల్పబలంతో అమలు చేస్తున్నాం అని, తెలంగాణ మాడల్ గా తుక్కుగూడలో ఏఐసీసీ నాయకత్వం స్పష్టమైన సందేశం ఇవ్వబోతుందన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ,సిరిసిల్ల నియోజకవర్గం నుండి సుమారు 6000 మందితో జన జాతర సభకు తరలి వెళ్తున్నామని అన్నారు..దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్సూచి కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.రాష్ట్రంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు,పేద ప్రజలకు అండగా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.దేశానికి కీలకమైన లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డమీద నుంచి కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసాను ఈ వేదిక నుంచే  విడుదల చేస్తారని.పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని సూచించారు.