– కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి కాన్గుల దశరథం
– జన జాతరకు తరలి రావాలని పిలుపు
నవతెలంగాణ-ఆమనగల్
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నేడు తుక్కగుడలో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభలో కాంగ్రెస్ అధినాయకత్వంతో కలిసి ఎన్నికల శంఖారావం మోగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి కాన్గుల దశరథం అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈమేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు ఇంటికి ఇద్దరుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు జే.రవి, డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.