– విజయనగరం ఉజ్జీవని ట్రస్టి రాణి
నవతెలంగాణ-బంజారాహిల్స్
హెరిటేజ్ భవనాల నుంచి ఎన్నో గొప్ప విషయాలు విద్యా ర్థులు నేర్చుకునేందుకు అవకాశం ఉందని, వాటిని కాపాడుక ోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని విజయనగర ఉజ్జీవని ట్రస్టి రాణి రత్నశ్రీ అన్నారు. బంజారాహిల్స్‌లోని జవహర్ లాల్ నెహ్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ కాలేజీ రెండు రోజుల నేష నల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్కిటెక్చరల్ అండ్ కల్చరల్ కార్నర్ స్టో న్స్ సదస్సులో ఆమె అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో కాక తీ యులు, చోళులు, విజయనగర రాజులు ఎన్నో అద్భు తమైన కట్టడాలు నిర్మించి ఒక కల్చర్‌ను ఏర్పాటు చేశారని నాటి కట్ట డాలను నేటి విద్యార్థులు చ్చితం గా చూడాల్సిన అవసరం ఉం దని అన్నారు. చరిత్ర అంటే ఏదో ఒక పదం కాదని నాటి సం స్కతులు, సంప్రదాయాలు, నాటి పద్ధతులు అప్పటి కట్టడాల్లో ఉంటాయని అన్నారు. హెరిటేజ్ భవనాలు, బావులు, ఆస్తులు కాపాడేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో సహకరి స్తు న్నాయన్నారు. ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్ జాన్వీజ్ కపూర్ మాట్లాడుతూ వరంగల్‌లోని వెయ్యి స్తంబాల గుడితో పాటు పలు పురాతన నిర్మాణాలను కాపాడేం దుకు చేసిన ప్రయత్నాలను వివ రించారు. తెలంగాణలో వేల ఏండ్ల నాటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని, అం దులో కొన్ని కను మరుగు కాగా కొన్ని శిథిలావస్థలో ఉన్నాయని వాటిని కాపాడేం దుకు కషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాటి రాజులు దేశంలో వేలాది బావులను తాగునీటి కోసం తవ్వించారని అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా రిసోర్ట్ చేయబడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం హెరిటేజ్ భవనా లపై ప్రత్యేకంగా రూపొంది ంచిన సావనీర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీపీఏ హైదరాబాద్ చాప్టర్ ప్రొఫెసర్ వీఐఐ.నర్సింహులు, మూర్తి క్షేత్ర ఆర్కిటెక్ జి.సూర్యనారా యణ, ఇంటాక్ సంస్థ కన్వీనర్ పిఅనురాధారెడ్డి, జేఎన్ఐఏఎస్ ప్రిన్సిపాల్ శాలిని, జేఎన్ఐఏఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ డి. సురేష్ పాల్గొన్నారు.