ఆషాలు విధి నిర్వహణలో పిట్టలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నారు

– ప్రభుత్వానికి పట్టదా ?
– ప్రభుత్వం ఆషాలకు పారితోషికం తక్షణమే చెల్లించాలి
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆశాలు విధినిర్వహణలో పిట్టల రాలిపోతున్నట్టు రాలిపోతున్నారని ఇది ప్రభుత్వానికి పట్టదా అని ప్రభుత్వం ఆశలకు పారితోషం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో ప్రశాంత్కి ఆశ వర్కర్ల సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా  వ్యాప్తంగా ఆశాలకు మార్చి నెల పారితోషికం ఇంకా రాలేదు. ప్రతినెలా 2వ తేదీన రావాల్సిన పారితోషికాలు 5 రోజులైనా రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆశాలు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు చేసి కుటుంబాలను పోషించే పరిస్థితికి రాష్ట్రంలో ఆశాలు నెట్టబడుతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. మార్చి నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలి. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలి. ప్రతినెలా 2వ తేదీన పారితోషికాలు చెల్లించే విధంగా చూడాలి. ఆశా వర్కర్ల అబ్బమ్మ , సరోజ,కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎడపల్లి మండలం, చెందిన అబ్బమ్మ , గారు విధి నిర్వహణ సందర్భంగా యాక్సిడెంట్ లో మరణించారు.  మోపాల్ మండలం సరోజ గారు విధి నిర్వహణలో వడదెబ్బ తగిలి మరణించారు. మాలపల్లి ఆశా వర్కర్ ఫాతిమా బి విధినిర్వహణలో వడదెబ్బ తగిలి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ పనులు  చేస్తున్న ఆశా కార్యకర్తలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా సౌకర్యం ప్రభుత్వం నుండి నోచుకోవడం లేదు. ప్రభుత్వ పనులను చేస్తున్న ఆశా కార్యకర్తలను గుర్తించకుండా, పని ఒత్తిడికి గురై అనేక మంది పిట్టల లాగ రాలిపోతున్నారు. పాలకుల నిర్లక్ష్యం  వల్ల కనీస బెనిఫిట్స్ పొందడం లేదు. అందుకని అబ్బమ్మ, సరోజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మరణించిన ఆశా కార్యకర్తలకు అబ్బవ్వ, సరోజ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అబ్బవ్వ, సరోజ కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వము తగు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సుకన్య, లలిత, జిల్లా నాయకులు సాహేరా బేగం, అతియా బేగం, కౌసర్ బేగం, తదితరులు పాల్గొన్నారు.