
వేసవి కాలంలో ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ శనివారం అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు గ్రామపంచాయతీ సెక్రెటరీలతో త్రాగునీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాల త్రాగునీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రటరీ నుంచి మండల స్థాయి అధికారులు అదరూ ప్రత్యేక దృష్టి సారించి. త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, తహసీల్దార్, డి ఆర్డబ్ల్యూఎస్, ఎంపీ ఓ, అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు, సెక్రటరీ లు పాల్గొన్నారు.