సైబర్ నేరాగళ్లతో అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఇందల్ వాయి పోలిసుల అధ్వర్యంలో ఖాతాదారులకు సైబర్ నేరాల పట్ల పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోల్లు ప్రారంభమైనందున ధాన్యం డబ్బులు వేస్తామని రైతులకు సైబర్ మోసగాళ్లు ఓటిపి చెప్పమని ఫేక్ ఫోన్ కాల్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ నెంబరు, ఎకౌంట్ నెంబరు, ఆధార్ నంబరు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పి మోసపోవద్దని సూచించారు. బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీల విషయం లో ఖాతాదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాగళ్ల ఉచ్చులో గతంలో ఎలా పడ్డారో విశదీకరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందల్ వాయి బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది నవీన్, ప్రకాష్ నాయక్, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.