
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడ చలో జన జాతర సభకు మద్నూర్ డోంగ్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చలో తుక్కుగూడ సభను విజయవంతం చేసేందుకు ప్రతి మండలం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లినట్లు ఆ పార్టీ మండలాల అధ్యక్షులు తెలిపారు. మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు హనుమాన్లు స్వామి సంగమేశ్వర్ కొండ గంగాధర్ వట్నాల రమేష్ జావిద్ పటేల్ సచిన్ ఇరు మండలాల్లోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.