నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలోని తాగునీటి ట్యాంకులను ఎంపీడీవో శంకర్, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు పరిశీలించారు. ప్రజలకు తాగునీటిని అందించే ట్యాంకులను ఎప్పటికీ అప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్యదర్శి శివకృష్ణ కు ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని వారన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యకు కార్యదర్శులు బాధ్యులని ఆయన పేర్కొన్నారు.