వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి

– రైతుల కోసం ఎంత దూరమైనా పోరాడుతాం. 
– మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. 
– భువనగిరిలో బిఆర్ఎస్ నిరసన
నవతెలంగాణ – భువనగిరి

రైతుల పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ను చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ  సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ ఇప్పుడు పండించిన వరి పంటకు తక్షణమే మద్దతు ధరతో పాటు రూ. 500  బోనస్ ను కలిపి చెల్లించాలన్నారు. లేనియెడల రైతులకు మద్దతుగా ఇలాంటి నిరసన కార్యక్రమాలతో పాటు మునుముందు రైతుల కోసం ఎంత దూరమైనా పోరాడడానికి ప్రతిపక్ష పార్టీగా నేను ముందు ఉంటానని  తెలిపారు.  ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ. 25 వేల   ప్రభుత్వ యంత్రాంగంతో పరిశీలించి నష్టపరిహారాన్ని రైతులకు వెంటనే అందచేయాలని కోరారు .  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి  జిల్లా మాజీ కన్వీనర్ కొలుపుల అమరేందర్లు మాట్లాడారు.  వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. కనీసం సరైన విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని విమర్శించారు. పాలనపై పూర్తిస్థాయిలో అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి  రాష్ట్ర నాయకులు     జడల అమరేందర్ గౌడ్      మున్సిపల్ మాజీ చైర్మన్  ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య,  వివిధ మండలాల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, తుమ్మల వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, రాచమల్ల రమేష్, ఇట్టబోయిన గోపాల్ పాల్గొన్నారు.

నేను ఓడిపోవడం కూడా మంచిదయింది. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోవడం కూడా మంచిదైందని తన వారు ఎవరో, బయట వారు ఎవరో తెలిసిపోయిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు .  నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శనాస్త్రాలు అందించారు.  అంతలోనే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కసం తన కోసం పార్టీ కోసం పనిచేసే నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ప్రజా సమస్యల కోసం ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.